రైతులకు శుభవార్త... ఖాతాల్లోకి నిధులు
E.G: జిల్లా రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద మూడో విడత నిధులు ఇవాళ రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. జిల్లాలోని 1,14,991 మంది రైతులకు ఈ లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ. 14,000, కేంద్రం రూ. 6,000 చొప్పున మొత్తం ఆర్థిక సాయాన్ని జమ చేయనున్నాయి. పెట్టుబడి సాయం నేరుగా ఖాతాల్లో పడనుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.