రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి

సారంగాపూర్ మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన శీలం మల్లేష్ ఈరోజు మృతి చెందాడు. గత పదమూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ..ఇవాళ మృతి చెందినట్లు తెలుస్తోంది. మల్లేష్ గత కొన్ని సంవత్సరాలుగా జగిత్యాలలో పాఠశాల బస్ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. అందరితో కలివిడిగా ఉండే మల్లేష్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.