నియోజకవర్గంలో 62,230 మంది సంతకాల సేకరణ
ప్రకాశం: కనిగిరిలో వైసీపీ కార్యాలయం నందు వైసీపీ ఇంఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్ బుధవారం కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వైసీపీ చేపట్టిన మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో 62,230 సంతకాలు పూర్తయ్యాయని అన్నారు. సంతకాల సేకరణ పత్రికలను ఇవాళ ఒంగోలు వైసీపీ కార్యాలయానికి పంపిస్తున్నట్లు తెలిపారు.