అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్‌లు అందజేస్తాం: మంత్రి

ELR: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు అందజేస్తామని మంత్రి కొలుసు పార్థసారథి సోమవారం పేర్కొన్నారు. నూజివీడులో మంత్రి క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. పింఛన్లను ఎంతమంది కోల్పోయారు, వారిలో ఎంతమంది అర్హులు ఉన్నారనే సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశించారు. ఎంపీడీవోలు రాఘవేంద్రనాథ్, భార్గవి పాల్గొన్నారు.