విద్యార్థులకు డ్రగ్స్ ఫ్రీ అవేర్నెస్ క్యాంపెయిన్
కృష్ణా: గుడివాడలో IMA ఆధ్వర్యంలో డ్రగ్స్ ఫ్రీ అవేర్నెస్ క్యాంపెయిన్‌లో భాగంగా ఈనెల 30న NTR స్టేడియంలో జరిగే సైక్లోథాన్ కాంపెయిన్ పై ఓ స్కూల్ విద్యార్థులకు ఈరోజు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ మాగంటి శ్రీనివాసరావు కోరారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు వివరించారు.