'104 వాహనాలు అన్ని పనిచేస్తున్నాయి'
PMM: జిల్లాలో ఉన్న 104 వాహనాలన్నీ బాగానే ఉన్నాయని, అవన్నీ పనిచేస్తూ సేవలు అందిస్తున్నట్లు డిఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 104 వాహనాలు మొత్తం 29 ఉన్నాయని, అవి ఎటువంటి ఆటంకం లేకుండా మెరుగ్గా పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. జిల్లా కేంద్రంలో అదనంగా రెండు 104 వాహనాలు ఉన్నాయని తెలిపారు.