సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ

సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ

బాపట్ల: కొల్లూరు మండలం క్రాప గ్రామానికి చెందిన క్యాన్సర్ రోగి మునిపల్లి మార్తమ్మకు సీఎం సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) నుంచి రూ.3 లక్షల ఆర్థిక సహాయం అందింది. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సిఫార్సు మేరకు సీఎంఆర్ఎఫ్ కార్యాలయం ఈ మొత్తాన్ని మంజూరు చేసింది. మంజూరైన ఎల్బీసీని శనివారం ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మునిపల్లి మార్తమ్మ కుటుంబ సభ్యులకు అందజేశారు.