లైసెన్స్ కేబుళ్లు తప్ప ఏవీ ఉంచొద్దు: హైకోర్టు

TG: GHMCలో లైసెన్స్ తీసుకున్న కేబుళ్లు తప్ప ఏవీ ఉంచొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్‌టెల్ పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక మరోసారి విచారణ చేపట్టారు. రామంతాపూర్‌లో ఐదుగురు మరణించిన ఘటనను న్యాయమూర్తి ప్రస్తావించారు. ప్రజల ప్రాణాలకు బాధ్యులెవరని జస్టిస్ నగేశ్ భీమపాక ప్రశ్నించారు.