రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
కర్నూలు: నందవరం మండలం ముగతి సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో రచ్చుమరి గ్రామానికి చెందిన షాషావలి (40) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.