'చేతి పంపులు బాగు చేయండి'
కృష్ణా: తోట్లవల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న చేతి పంపులు, నీటి కుళాయిలు పనిచేయకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి కాలం ప్రారంభమై నీటి మట్టం తగ్గడంతో పలుచోట్ల నీరు రావడం లేదని ప్రజలు చెబుతున్నారు. గ్రామాల్లో ఉన్న చేతి పంపులను లెక్కించి, వాటికి వెంటనే మరమ్మతులు చేయించి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.