ఈ నెల 28న మఠాధిపతి నియామకంపై సమావేశం

ఈ నెల 28న మఠాధిపతి నియామకంపై సమావేశం

KDP: బ్రహ్మంగారిమఠం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠాధిపతి నియామక విషయమై ఈ నెల 28వ తేదీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ఆదివారం తెలిపారు. మఠం శిష్యులతో సమావేశం ఉంటుందని, భక్తులు హాజరై సలహాలు, సూచనలు లిఖిత పూర్వకంగా తెలపవచ్చన్నారు. పోస్ట్ ద్వారా కూడా అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చన్నారు.