మూడు బీసీ హాస్టళ్ల భవనాలకు నిధులు మంజూరు

KMM: జిల్లాలో శిథిలావస్థకు చేరిన బీసీ సంక్షేమ వసతిగృహాల భవనాల స్థానంలో కొత్త నిర్మాణాలకు అనుమతి మంజూరైంది. మంత్రి తుమ్మల ప్రతిపాదనలతో ఖమ్మంలో మూడు బీసీ వెల్ఫేర్ హాస్టల్ భవనాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిధులతో వి. వెంకటాయపాలెం, ఖమ్మం ముస్తఫానగర్-1, జహీర్పురలోని బీసీ బాలుర హాస్టల్-2కు అన్ని హంగులతో నూతన భవనాలు నిర్మించనున్నారు.