రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు
MDK: తూప్రాన్ పట్టణ పరిధిలోని అల్లాపూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. తూప్రాన్-గజ్వేల్ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో యువకుడు స్పృహ కోల్పోయాడు. స్థానికులు వెంటనే స్పందించి అంబులెన్స్‌లో అతడిని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడికి వైద్యం అందుతోంది. యువకుని వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.