చిన్నకడబూరులో బండలాగుడు పోటీలు

KRNL: పెద్దకడబూరు మండలం చిన్నకడబూరులో శ్రీ ఆంజనేయస్వామి రథోత్సవం సందర్భంగా ఈనెల 13న తాలూకా స్థాయి బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు ఆర్గనైజర్లు మంగళవారం తెలిపారు. ఇందులో విజేతలుగా నిలిచిన కాడెద్దులకు ప్రథమ బహుమతిగా టీడీపీ ఇంఛార్జ్ రాఘవేంద్రారెడ్డి రూ.15 వేలు, 2వ బహుమతిగా నరసన్న 10వేలు, 3వ బహుమతిగా లక్ష్మన్న 8వేలు అందజేయనున్నట్లు తెలిపారు.