హైవేపై మద్యం లారీ బోల్తా

హైవేపై మద్యం లారీ బోల్తా

నెల్లూరు: తడ మండలం అక్కంపేట సమీపంలో మద్యం తరలిస్తున్న లారీ ఇవాళ అదుపుతప్పి పంటపొలాల్లో బోల్తాపడింది. చెన్నై నుంచి నెల్లూరుకు వస్తూ.. అక్కంపేట వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు గాయాలైయ్యాయి. గాయపడిన డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మద్యం బాటిళ్లు ధ్వంసమైనట్లు స్థానికులు తెలిపారు.