చౌడేశ్వరి దేవి ఆలయంలో పౌర్ణమి పూజలు

చౌడేశ్వరి దేవి ఆలయంలో పౌర్ణమి పూజలు

NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఇవాళ పౌర్ణమి పూజలను భక్తులు ఘనంగా నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాన్ని ప్రత్యేక పూలమాలలతో అలంకరించారు. నందవరం గ్రామంలో చౌడేశ్వరి దేవి అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపు చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.