అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి రెడ్ క్రాస్ చేయూత

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి రెడ్ క్రాస్ చేయూత

కృష్ణా: కోడూరు పరిధిలోని పిట్టలంక గ్రామానికి చెందిన కైలా శరత్ బాబు పూరిల్లు దగ్ధమైంది. విద్యుత్ షాక్ సర్‌క్యూట్‌తో అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయింది. బుధవారం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు వంట సామాగ్రి కిట్టు, తార్బల్ పట్టా, 25 కేజీల బియ్యం, కూరగాయలు అందించినట్లు తెలిపారు. ఈ సహాయం మండలం రెడ్ క్రాస్ ఛైర్మన్ వేజెండ్ల శ్రీనివాసరావు సౌజన్యంతో ఇచ్చామన్నారు.