బీజేపీ కార్యాలయంలో వాజ్ పేయి వర్ధంతి

మెదక్ పట్టణంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో మాజీ ప్రధాని, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రహదారుల నిర్మాణంతో దేశాన్ని అభివృద్ధి పరుగులు పెట్టించి, ప్రజల గుండెల్లో నిలిచిన గొప్ప నాయకుడు వాజ్ పేయి అని అన్నారు.