35 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

35 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

గద్వాల మండలం గోనుపాడు సమీపంలో రూరల్ పోలీసులు ఆదివారం వాహనాల తనిఖీలో రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. రూరల్ ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ.. గద్వాల నుంచి రాయచూరు వైపు వెళ్తున్న ఒక వాహనాన్ని తనిఖీ చేయగా అందులో 70 ప్లాస్టిక్ సంచుల్లో దాదాపు 35 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించామన్నారు. అక్రమ రవాణాకు పాల్పడిన కృష్ణపై కేసు నమోదు చేసారు.