పరువు పోయిందని వ్యక్తి ఆత్మహత్య

GDL: మానవపాడు మండలం బోరవెల్లి గ్రామానికి చెందిన షేక్ హుస్సేన్ అనే మేస్త్రీ క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తున్న హుస్సేన్ బైక్ అదే గ్రామానికి చెందిన రమేశ్‌కు స్వల్పంగా తగిలింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో తన పరువు పోయిందని మనస్తాపం చెందిన హుస్సేన్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.