నేటి నుంచి ఉద్యానవర్సిటీలో స్పోర్ట్స్ మీట్
W.G: తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం డా. వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో నేటి నుంచి 15 వరకు 12వ ఇంటర్ కాలేజియేట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ నిర్వహించనున్నట్లు ఉపకులపతి డాక్టర్ ధనుంజయరావు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయం పరిధిలోని 5 ప్రభుత్వ, 3 ప్రైవేటు కళాశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.