గృహ గణన పారదర్శకంగా జరగాలి: కలెక్టర్
GDWL: జనగణన 2027లో భాగంగా ఇండ్ల గణన పారదర్శకంగా నిర్వహించాలని గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. బుధవారం ఐడీఓసీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో 2027 ఫేస్-1 గృహ గణనపై ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ నిర్వహించారు. జనగణన దేశాభివృద్ధికి ముఖ్యమైన సమాచార సేకరణ ప్రక్రియ అన్నారు. ప్రతి అంశాన్ని కచ్చితంగా నమోదు చేయాలన్నారు.