అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్ సీజ్
SRPT: మద్దిరాల మండలంలోని ముకుందాపురం వద్ద శనివారం అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నట్లు ఎస్సై వీరన్న తెలిపారు. రామపురం గ్రామానికి చెందిన అలువాల యాదగిరి పాలేరు వాగు నుంచి తన ట్రాక్టర్ (TG 26 D 2458)లో అనుమతి లేకుండా ఇసుక తరలిస్తుండగా తనిఖీల్లో దొరికిపోయాడు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.