రేపటి నుంచి జాతీయ స్థాయి నాటక పోటీలు
NLG: మిర్యాలగూడలో 9 నుంచి 15వ తేదీ వరకు జాతీయ స్థాయి పద్య నాటక, సాంఘిక నాటక పోటీలు జరగనున్నాయి. సాంస్కృతిక కళాకేంద్రం ఆధ్వర్యంలో 'వేదిక కళాభారతి' ఆడిటోరియంలో నిర్వహించే ఈ ఉత్సవాల్లో నాటకాలతో పాటు నృత్య ప్రదర్శనలు ఉంటాయని అధ్యక్షులు రామచంద్రరావు తెలిపారు. ఆసక్తి గలవారు పాల్గొనాలని ఆయన పేర్కొన్నారు.