'విద్యుత్ వైర్లు తగిలి మంటలు'

'విద్యుత్ వైర్లు తగిలి మంటలు'

ప్రకాశం: మార్కాపురం మండలం రామచంద్రపురం కొండేపల్లి రోడ్ సమీపంలో బుధవారం రాత్రి టిప్పర్‌కు విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. ఓ వెంచర్లు మట్టి అన్‌లోడ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డీజిల్ ట్యాంకరు టైర్లు ధ్వంసమయ్యాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.