స్కూల్‌లో అర్ధనగ్నంగా డ్యాన్స్ చేసిన విద్యార్థినులు
కోల్‌కతాలోని జీబన్ జ్యోతి మోడల్ స్కూల్ సాంస్కృతిక కార్యక్రమంలో బాలికలు కేవలం తువ్వాలు చుట్టుకుని డ్యాన్స్ చేయడం తీవ్ర వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. చిన్న పిల్లలు ఉండే విద్యా సంస్థల్లో ఇలాంటి ప్రదర్శనలు సంస్కృతికి విరుద్ధమని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.