'జిల్లాలో రేపు భారీ వర్షాలు పట్ల అప్రమత్తంగా ఉండండి'

PPM: మన్యం జిల్లాలో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిందని జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల వలన ఎటువంటి ప్రాణ, ఆస్తి, నష్టాలు జరగరాదని, ఇందుకోసం ముందుగా గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని స్పష్టం చేశారు.