కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనానికి శంకుస్థాపన

BPT: బాపట్ల పట్టణంలో కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ భవనానికి బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ శంకుస్థాపన చేశారు. ఆదివారం బాపట్ల పట్టణంలోని శివాలయం దగ్గర ఎంజీ రహదారిలో నూతనంగా నిర్మిస్తున్న అసోసియేషన్ భవన శంకుస్థాపన మహోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఆయనకు స్వాగతం పలికి సత్కరించారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.