'పాఠశాల ఇకపై మోడల్ ఆశ్రమ పాఠశాలగా అప్ గ్రేడ్'
ASF: తిర్యాణి మండలం గిరిజన ఆశ్రమ పాఠశాలను రానున్న విద్యా సంవత్సరం నుంచి 'మోడల్ ఆశ్రమ పాఠశాల'గా అప్ గ్రేడ్ చేస్తున్నట్లు జిల్లా DD రమాదేవి ప్రకటనలో తెలిపారు. ఈ పాఠశాలలో ప్రవేశం కోసం ప్రస్తుతం 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారిని మోడల్ పాఠశాలకు ఎంపిక చేస్తామన్నారు.