ఈనెల 5న కార్మిక కవాతు చేస్తాం: RTC జేఏసీ ఛైర్మన్

TG: ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు పిలిస్తే వెళ్లేందుకు సిద్ధమని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ వెంకన్న అన్నారు. చర్చలపై యాజమాన్యం నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదని స్పష్టం చేశారు. చర్చలకు పిలిచే వరకు యథావిథిగా తమ కార్యచరణ కొనసాగుతుందని తెలిపారు. ఈనెల 5న బస్ భవన్ ఎదుట కార్మిక కవాతు చేస్తామని వెల్లడించారు.