రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యానికి భరోసానిస్తుంది: ఎమ్మెల్యే

KMM: పేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసానిస్తుందని ఎమ్మెల్యే రాగమయి అన్నారు. బుధవారం తల్లాడ మండల పరిధిలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు CMRF చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడే పేదల చికిత్స నిమిత్తం ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని చెప్పారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు సీఎం సహాయ నిధి ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.