ఆర్టీసీ బస్టాండ్ దుర్గంధ భరితం

ఆర్టీసీ బస్టాండ్ దుర్గంధ భరితం

MBNR: జిల్లా కేంద్రంలోని బస్టాండ్ పరిసరాలు దుర్గంధ భరితంగా మారి ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. హోటల్స్, షాపింగ్ కాంప్లెక్స్ వ్యర్థ పదార్థాలు, చెత్తాచెదారం, మల మూత్ర విసర్జనలతో దుర్వాసనలకు RTC బస్టాండ్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నారు.