'విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి;
ASF: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. ఇటీవల రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలలో బంగారు పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలలో రాష్ట్ర జట్టుకు ఎంపికైన విద్యార్థులు శుక్రవారం కలెక్టర్‌ను కలిశారు. క్రీడలలో అత్యున్నత ప్రతిభ కనబరిచేలా విద్యార్థులకు తర్ఫీదు అందించిన కోచ్, PETలను అభినందించారు.