'జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

'జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి'

VZM: మార్చి14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కక్షీదారులు సద్వినియోగం చేసుకోవాలని కొత్తవలస జూనియర్ సివిల్ జడ్జి డా,కే. విజయ్ చందర్ సూచించారు. ఈ మేరకు మండల న్యాయ సేవా కమిటీ ఆధ్వర్యంలో రామలింగాపురంలో సోమవారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను సులువుగా పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీపి, న్యాయవాదులు పాల్గొన్నారు.