ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి: JC
Jgl: జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆదేశాల మేరకు, గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆర్వోలు, ఏఆర్వోలకు ఫేజ్-2 శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, జగిత్యాల ఆర్డీవో మధుసుధన్, జిల్లా వ్యయ పరిశీలకులు జి. రమేష్, ఎం. మనోహర్, మదన్ పాల్గొన్నారు.