పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

GNTR: తుళ్లూరు మండలంలో సోమవారం నుంచే NTR భరోసా సామాజిక పింఛన్‌ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ నగదును అందజేశారు. ఈ సందర్భంగా ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఆయన స్పందించి అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.