జిల్లాలో వణికిస్తున్న చలి..!

జిల్లాలో వణికిస్తున్న చలి..!

NLG: నవంబర్‌ నెల ప్రారంభంలోనే చలి ఉమ్మడి జిల్లాను వణికిస్తున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. నవంబర్‌ మొదట్లోనే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని జనం చర్చించుకుంటున్నారు.