గ్రామాల అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే
కోనసీమ: గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. అమలాపురం రూరల్ మండలం తాండవపల్లిలో నూతనంగా నిర్మించిన రక్షిత మంచినీటి ట్యాంకును, సీసీ రోడ్డు, కల్వర్టులను ఎమ్మెల్యే సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాబోయే రోజులలో గ్రామంలో సిమెంటు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరుస్తామన్నారు.