క్లారిటీ.. అది చిరుతపులి కాదు హైనా..!

క్లారిటీ.. అది చిరుతపులి కాదు హైనా..!

RR: షాద్‌నగర్ సమీపంలోని బాలాజీ టౌన్ షిప్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరిస్తున్నది చిరుత పులి కాదని అది హైనా అని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. అక్కడ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న జంతువుల జాడల ఆధారంగా హైనా అని స్పష్టం చేశారు. అనంతరం సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి అడవి పిల్లితో పాటు హైనా ఆనవాళ్లు కనిపించాయన్నారు. ప్రజలెవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.