గంగమ్మ తల్లి ఒడిలో చేరేందుకు బయలుదేరిన గణనాథుడు

NTR: గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తిరువురు శాంతినగర్‌లోని గణనాథుని నిమజ్జనం గురువారం వైభవంగా జరిగింది. 14 రోజుల పూజల అనంతరం భక్తులు మేళతాళాలు, సాంప్రదాయ నృత్యాలతో పట్టణ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు భక్తిపారవశ్యంతో గణపతిని కొలుచుకున్నారు. అనంతరం గణనాథుడిని గంగమ్మ తల్లి ఒడిలోకి చేర్చడానికి బయలుదేరారు.