పిడుగు పడి ఆవు మృతి

సిరిసిల్ల: చందుర్తి మండలం నర్సింగపూర్‌లో ఆదివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో పూడూరి మల్లారెడ్డి అనే రైతుకు చెందిన ఆవు పిడుగుపాటుకు గురై మృతి చెందింది. ఆవు విలువ దాదాపు లక్ష రూపాయల వరకు ఉంటుందని రైతు కన్నీటి పర్యంతం అయ్యారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరాడు.