బిచ్కుందలో ఎస్జీటీ ఉపాధ్యాయ సంఘం కమిటీ ఎన్నిక

బిచ్కుందలో ఎస్జీటీ ఉపాధ్యాయ సంఘం కమిటీ ఎన్నిక

KMR: బిచ్కుంద మండలంలో ఎస్జీటీ ఉపాధ్యాయ సంఘం నూతన కమిటీని మంగళవారం ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో మండల ప్రధాన కార్యదర్శిగా మందుల భాస్కర్, సహాయ కార్యదర్శిగా దర్జీ సంతోష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యల సంతోష్ నూతన కార్యవర్గానికి నియామక పత్రాలను అందజేశారు. ఎస్జీటీ సంఘాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.