సోమవారం ప్రజా ఫిర్యాదుల సేకరణ

సోమవారం ప్రజా ఫిర్యాదుల సేకరణ

AKP: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం ఉదయం 10 గంటలకు అనకాపల్లి కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మండల, డివిజన్ స్థాయి కార్యాలయాల్లో అర్జీలు స్వీకరించనున్నట్టు చెప్పారు. అలాగే ‘మీకోసం’ వెబ్‌సైట్ ద్వారా ప్రజలు తమ ఫిర్యాదులను ఆన్లైన్‌లో కూడా సమర్పించవచ్చని ఆమె కోరారు.