శనీశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

శనీశ్వరస్వామికి  ప్రత్యేక పూజలు

KDP: శని త్రయోదశి సందర్భంగా శనివారం కడప శ్రీ విజయదుర్గాదేవి ఆలయంలో శనీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి. నవగ్రహ మండపంలో ఉదయం నుంచి పంచామృతాభిషేకం, తైలాభిషేకం, పుష్పార్చన వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య భక్తులు శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి విశేష పూజల్లో పాల్గొన్నారు.