విద్యుత్ శాఖ దాడులు.. రూ.4.37లక్షల ఫైన్

GNTR: మంగళగిరిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సీఆర్డీఏ పర్యవేక్షక ఇంజనీర్ ఎం.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ అధికారులు దాడులు చేశారు. ఆత్మకూరు, చినకాకాని, చినవడ్లపూడి, కాజ, కొత్తపాలెం, నూతక్కి, వడ్లపూడి ప్రాంతాల్లో 34 మంది అధికారులు 102 మంది సిబ్బిందితో 34 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేశారు. 33 సర్వీసులకు రూ.4.37 లక్షలు అపరాధ రుసుము విధించారు.