కనిగిరిలో మానవ హక్కుల దినోత్సవం

కనిగిరిలో మానవ హక్కుల దినోత్సవం

ప్రకాశం: మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బుధవారం కనిగిరి కోర్టు ఆవరణంలో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జడ్జి బి. రూపశ్రీ మాట్లాడుతూ.. పేదలకు, బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సలహాలు, సహాయం అందించి, వారి హక్కులను కాపాడుకోవడంలో న్యాయ సేవాధికార సంస్థ సేవలు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.