'లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు'

'లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు'

ASR: జిల్లాలో లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ దినేష్ కుమార్ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. ఆడపిల్లల సంఖ్యను పెంచుదాం, ఆడ-మగ సమతుల్యాన్ని సాధిద్దాం అన్నారు. గర్భం ధరించడానికి ముందుగాని, గర్భం ధరించిన తర్వాత గాని, పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.