సీపీఐ వెనక రష్యా ఉంది: అమిత్ షా
దేశంలో CPI ఏర్పాటు వెనక రష్యా కమ్యూనిస్టుల హస్తం ఉందన్న వాదన ఉందని కేంద్రమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కమ్యూనిస్టులు ఆంగ్లేయులను కూడా సమర్థించారని మండిపడ్డారు. సీపీఐ ఉన్నాక మళ్లీ CPI(M) ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. CPI, CPM తర్వాత మళ్లీ మావోయిస్టు పార్టీ ఎందుకు ఏర్పాటైందని నిలదీశారు. 2004లో కొన్ని కమ్యూనిస్టు గ్రూపులు ఏకమై మావోయిస్టు పార్టీ ఏర్పడిందని ఆరోపించారు.