మెట్‌పల్లి జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో

మెట్‌పల్లి జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో

JGL: మెట్‌పల్లి పట్టణంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ పాత బస్టాండ్ వద్ద 63వ నంబర్ జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. తమ పంటకు సరైన ధర లభించడం లేదని, ప్రభుత్వం తక్షణమే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని సమస్యను పరిష్కరిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.