ఇండియా కూటమి నేతలు రాజ్యాంగ రక్షకులు: నాగరాజు
ATP: చట్టసభల్లో ఓబీసీ రిజర్వేషన్లు, మహిళా బిల్లులో ఓబీసీ కోటా కోసం గళమెత్తిన ఇండియా కూటమి నేతలు రాజ్యాంగ రక్షకులుగా నిలుస్తారని రిజర్వేషన్ల పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు డా.పోతుల నాగరాజు పేర్కొన్నారు. 131వ రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకించి బలహీన వర్గాల రాజకీయ హక్కులను కాపాడారని కొనియాడారు. కేంద్రం ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు.